తెలంగాణ

telangana

ETV Bharat / city

'పది మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలి' - telangana varthalu

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా నాయకులు బాధ్యత తీసుకోవాలని తరుణ్​ చుగ్​ సూచించినట్లు భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్​ తెలిపారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తరుణ్‌ చుగ్‌ దిశానిర్దేశం చేసినట్లు ఆయన వెల్లడించారు.

'పది మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలి'
'పది మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలి'

By

Published : Jan 7, 2021, 5:12 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే పది మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ సూచించినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, డీకే.అరుణ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని 70మంది ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిట్టింగ్‌ స్థానమైన మహాబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తరుణ్‌ చుగ్‌ దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి షోకాజ్​ నోటీసు

ABOUT THE AUTHOR

...view details