తెలంగాణ

telangana

ETV Bharat / city

"సమ్మె జరుగుతుంటే... ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా?" - tsrtc jac announces state bandh

ఓ వైపు ఆర్టీసీలో సమ్మె జరుగుతుంటే.. మరోవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇది ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడమేనని తెలిపారు. కేసీఆర్.. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర బంద్​కు భాజపా నేత లక్ష్మణ్​ మద్దతు

By

Published : Oct 13, 2019, 6:10 PM IST

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ తీరు బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఐదేళ్లలో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదని చెప్పారు. రూ.2 వేల కోట్ల వరకు ఆర్టీసీ నిధులు వాడుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెను భగ్నం చేసేందుకు దసరా సెలవులు పొడిగించారన్నారు. విద్యార్థులను ఆర్టీసీ సమ్మెకు దూరంచేసేందుకే సెలవుల పెంచారని తెలిపారు. ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన 19వ తేదీ రాష్ట్ర బంద్‌కు భాజపా మద్దతిస్తోందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details