తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికలొస్తేనే సీఎంకు పీఆర్​సీ గుర్తొస్తుందా..?: లక్ష్మణ్​ - ఎన్నికలొస్తేనే సీఎంకు పీఆర్​సీ గుర్తొస్తుందా..?

రాష్ట్రంలో ఎన్నికల వచ్చినప్పుడే సీఎంకు పీఆర్​సీ గుర్తుకువస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ విమర్శించారు. హైదరాబాద్​ ఇందిరాపార్కులోని ధర్నా చౌక్​ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంచందర్​రావుతో కలిసి హాజరయ్యారు.

bjp state president laxman question to cm kcr over prc
ఎన్నికలొస్తేనే సీఎంకు పీఆర్​సీ గుర్తొస్తుందా..?: లక్ష్మణ్​

By

Published : Mar 4, 2020, 6:15 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికలు వస్తేనే పీఆర్‌సీ గుర్తుకువస్తోందని.. ముగియగానే ఆ అంశం కనుమరుగవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద పీఆర్‌సీపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగుల సెల్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి లక్ష్మణ్‌ హాజరయ్యారు.

పీఆర్‌సీని ప్రకటించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఆరేళ్ల కాలంలో ఒక్క డీఏస్సీ కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొలువుల కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెరాస ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీని ప్రకటించాలని.. లేనిపక్షంలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఎన్నికలొస్తేనే సీఎంకు పీఆర్​సీ గుర్తొస్తుందా..?: లక్ష్మణ్​

ఇవీచూడండి:గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ

ABOUT THE AUTHOR

...view details