తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్' - bjp state president

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్: లక్ష్మణ్

By

Published : Aug 8, 2019, 7:38 PM IST

జమ్ము కశ్మీర్‌ విభజనతో కాంగ్రెస్‌లోనూ విభజన మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్‌తో కేవలం మూడు కుటుంబాలే రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందినట్లు వివరించారు. జమ్ము కశ్మీర్‌ మాదిరిగానే మోదీ, అమిత్ షా తెలంగాణ విమోచనదినానికి పరిష్కార మార్గం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఐదు వేల కోట్ల విలువైన భవనాలు సచివాలయంలో ఉన్నప్పుడు కూల్చి కొత్తవి కట్టడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్: లక్ష్మణ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details