హైదరాబాద్‌ను ఊటీ చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు పార్టీలో అటువంటి ప్రస్తావన రాలేదన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 52 శాతం పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తయిందని లక్ష్మణ్ వెల్లడించారు. డిసెంబర్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కమిటీల నియామకాలు పూర్తవుతాయన్నారు. పార్టీ తనకు ఏబాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తెరాసకే అనుకూలం...
మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఈసారి అన్ని వార్డుల్లోనూ పోటీచేస్తామని ప్రకటించారు. పురపాలక ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలమన్న లక్ష్మణ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలు తమకు సెమీఫైనల్ అన్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసీఆర్ గ్రాఫ్ తగ్గి.. మోదీ ఇమేజ్ పెరుగుతోందన్నారు.