పార్టీ నియమ నిబందనలకు వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోకూడదని కార్యకర్తలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బండి సంజయ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాజపా నూతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి, గరిక పాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి జాతీయ నాయకుల వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలన్నారు.
'రాష్ట్ర అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసింది' - bjp meeting
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నూతన పదాధికారుల తొలి సమావేశం జరిగింది. బూత్ స్థాయి నుంచి జాతీయ నాయకుల వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని కార్యకర్తలకు సంజయ్ సూచించారు.
bjp state president bandi snajay instructions to activists
హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ పత్తా లేకుండా పోయాడని సంజయ్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమీక్షలో ఒకటి మాట్లాడి బయటకు మరొకటి చేప్తారని ఆరోపించారు. రాష్ట్ర అవినీతిపై కేంద్రం డేగకన్ను వేసిందని పేర్కొన్నారు. 2023లో రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి రాబోతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.