నెక్లెస్ రోడ్లో సేద తీరుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దుండుగులు దాడి చేశారు. భాజపా నేతల కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురిపై రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం
21:35 November 30
నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం
అంతకుముందు బండి సంజయ్ చిన్నపిల్లలతో కలిసి ఆటలు ఆడారు. ఉదయం నుంచి దేవాలయాల సందర్శన, హోమాల్లో పాల్గొన్న ఆయన... రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొద్దిసేపు సేద తీరేందుకు నెక్లెస్ రోడ్‌కు వచ్చారు.
బండి సంజయ్‌పై హత్యాయత్నం జరగలేదని మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బండి సంజయ్, భాజపా కార్యకర్తలు నెక్లెస్‌రోడ్డుకు వచ్చారని.... తెరాస అభ్యర్థి అనుచరులు సంజయ్ వాహనం అడ్డుకునే యత్నం చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని.. భాజపా కార్యకర్తల కారు అద్దాలను ఇతర పార్టీ నేతలు ధ్వంసం చేశారని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:51వేల మంది పోలీసులతో బల్దియా పోరుకు భద్రత