తెలంగాణలో భాజపా ఎక్కడుందన్న కేసీఆర్కు... ఆయన సొంత జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఫాంహౌస్లో దొడ్డు రకం వడ్లు పండించిన కేసీఆర్... రైతులను సన్నాలు పండించమని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండి పడ్డారు. పాతబస్తీలో ఎంత పన్నులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదన్న సంజయ్... రాష్ట్ర ఖజానా అంతా అక్కడే ఖర్చు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్.. మీ జిల్లాలో భాజపా ఎమ్మెల్యే ఉన్నాడు: బండి - భాజపా నేతలతో బండి సంజయ్ జూమ్ సమావేశం
వరద సాయం పేరుతో తెరాస ఓట్లు కొనుగోలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై నాయకులతో జూమ్ సమావేశంలో మాట్లాడారు.
![కేసీఆర్.. మీ జిల్లాలో భాజపా ఎమ్మెల్యే ఉన్నాడు: బండి bjp state president bandi sanjay zoom meeting with leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9510969-thumbnail-3x2-bandi.jpg)
వరద సాయం పేరుతో ఓట్ల కొనుగోలుకు రూ.పదివేలు పంచుతున్నారని సంజయ్ విమర్శించారు. లాక్డౌన్లో జీవితాలు నాశనమైన ఎంతో మందిని ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. జీహెచ్ఎంసీలో భాజపా గెలవబోతుందని సర్వేలు చెబుతున్నాయన్న సంజయ్... 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిశీలించి... పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో భాజపాను గెలిపించండి'
TAGGED:
bandi sanjay zoom meeting