రాష్ట్ర ప్రజలందరికీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు - BJP State President Bandi Sanjay
రాష్ట్ర ప్రజలందరికీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తాము చేపడుతున్న కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
![రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు BJP State President Bandi Sanjay wishes Dussehra to the people of the Telangana state Peoples](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9305126-88-9305126-1603606281914.jpg)
రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు
చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తుచేశారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.