రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలులో రాష్ట్రప్రభుత్వం రెండేళ్లు ఆలస్యం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మండిపడ్డారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయని కారణంగా రోగాల బారిన పడ్డ పేదలు ఆర్థికంగా నష్టపోయారని.. మరి కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే తెలంగాణలోనూ తెరాస సర్కారు అమలు చేసివుంటే ఎంతమంది పేదలకు లాభం జరిగేదో ఒక్కసారి కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఆయుష్మాన్ భారత్ అమలులో రెండేళ్లు జాప్యం: బండి సంజయ్ - తెలంగాణ వార్తలు
ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ పట్ల కేసీఆర్ అభిప్రాయాన్ని మార్చుకోవడాన్ని భాజపా గుర్తించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయని కారణంగా రోగాల బారిన పడ్డ పేదలు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆయుష్మాన్ భారత్ అమలులో రెండేళ్లు జాప్యం: బండి సంజయ్
కరోనా బాధితులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం చికిత్సలు అందిస్తోందని.. రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం