2023లో గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు సేవ చేశారన్న ఆయన... కరోనా విషయంలో ముఖ్యమంత్రి అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపించారు. టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని సైతం... పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆధారాలతో బయటపెట్టాం