రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల వద్ద పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రజాకార్ల కాలంలో హిందూ పండుగలు జరుపుకోవడానికి ఆంక్షలు విధించేవారని... ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద కూడా నిర్బంధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు: బండి - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపాటు
గణేష్ ఉత్సవాల పట్ల ప్రభుత్వ వైఖరిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. రజాకార్ల కాలంలో హిందూ పండుగలు ఆంక్షలు విధించినట్టు... నయా నిజాంలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు: బండి
పూజల కోసం వచ్చే అర్చకులను సైతం వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైసీల చేతిలో కీలు బొమ్మగా మారిన కేసీఆర్... హిందూ పండుగల పట్ల చూపుతున్న వివక్షను చరిత్ర క్షమించదన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిరభ్యంతరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్బంధం వైఖరిని తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.