తెలంగాణ

telangana

ETV Bharat / city

'పత్రికలకు, జర్నలిస్టులకు భాజపా అండగా ఉంటుంది' - ప్రజలను కేసీఆర్ తప్పుదారి పట్టించారు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. వైరస్ వ్యాప్తి గురించి వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు.

bjp state president bandi sanjay fire on cm kcr
పత్రికలకు, జర్నలిస్టులకు భాజపా అండగా ఉంటుంది: బండి

By

Published : Jul 6, 2020, 5:42 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలను తప్పుదారి పట్టించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కుమార్ విమర్శించారు. పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే, 20డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వైరస్ వ్యాపించదని హాస్యాస్పదంగా మాట్లాడారని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నగరంతోపాటు పలు జిల్లాల్లో విలయ తాండవం చేస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కక్షసాధింపు చర్యలకు, అణిచివేతకు ముఖ్యమంత్రి పర్యాయ పదంగా మారారాని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తప్పుడు వార్త ప్రచురితం చేశారని ఖమ్మంలో జర్నలిస్టుపై కేసు బనాయించిన కేసీఆర్​పై.. అసత్య ప్రకటనలు చేసినందుకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పత్రికా యాజమాన్యాలకు, జర్నలిస్టులకు భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

ABOUT THE AUTHOR

...view details