ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని ముందుకెళ్లడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎంఐఎం అనుచిత వ్యాఖ్యలు చేసినా... ఖండించని పార్టీ తెరాస అంటూ అంటూ మండిపడ్డారు. సీఎం వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.
ప్రజలు గమనిస్తున్నారు.. తెరాసకు గుణపాఠం తప్పదు: బండి - భాజపాలో చేరిన శివసేన రాష్ట్ర అధ్యక్షుడు మురారి
తెరాస, ఎంఐఎం వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన గణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శివసేన రాష్ట్ర అధ్యక్షుడు మురారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
![ప్రజలు గమనిస్తున్నారు.. తెరాసకు గుణపాఠం తప్పదు: బండి bjp state president bandi sanjay comments on trs mim relationship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9151285-thumbnail-3x2-bandi.jpg)
ప్రజలు గమనిస్తున్నారు.. తెరాసకు గుణపాఠం తప్పదు: బండి
బీసీల స్థానంలో ముస్లింలను గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శివసేన రాష్ట్ర అధ్యక్షడు మురారీ భాజపాలో బండి సంజయ్ సమక్షంలో చేరారు. కాంగ్రెస్‌తో శివసేన కలవడం తనకు మనస్తాపం కలిగించిందని మురారీ తెలిపారు. రాష్ట్రంలో తెరాసతోపాటు మజ్లిస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు.
ప్రజలు గమనిస్తున్నారు.. తెరాసకు గుణపాఠం తప్పదు: బండి
ఇదీ చూడండి:భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?
TAGGED:
bandi sanjay comments on mim