భాజపా కార్యకర్తల వీరోచిత పోరాటం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బల్దియాలో ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాషాయ కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే బల్దియా విజయం: బండి సంజయ్ - Baldia Election Results
సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పాం కానీ.. బల్దియా ఎన్నికల్లో సాఫ్రాన్ స్ట్రైక్ చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాషాయ కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే జీహెచ్ఎంసీ విజయమని తెలిపారు.
కాషాయ కార్యకర్తల వీరోచిత పోరాటమే బల్దియా విజయం
రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన బల్దియా కమిషనర్, భాజపా కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీకి ఈ విజయం అంకితం చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. తెరాస పతనం, కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
Last Updated : Dec 4, 2020, 8:00 PM IST