ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాలకి తరుణ్ చుగ్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. తొలిరోజు పర్యటనలో భాగంగా తొలుత బల్దియా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమవుతారు. అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమై పార్టీకి సంబంధించిన వ్యవహారాలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నాం 3 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత యువ మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులతో సమావేశం అవుతారని పార్టీ నేతలు చెబతున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ అనుబంధంగా ఉన్న ఏడు మెర్ఛాల రాష్ట్ర అధ్యక్షులు, ఇంఛార్జ్‌లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే విడిది చేయనున్నారు.
నేడు రాష్ట్రానికి తరుణ్‌చుగ్... నేతలకు దిశానిర్దేశం - jp state incharge tarun news
నేడు రాష్ట్రానికి భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ రానున్నారు. రాష్ట్ర ఇంఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారి రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్నారు. తరుణ్ చుగ్ పర్యటనతో పాటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన భాజపా జీహెచ్ఎఎంసీ కార్పొరేటర్లు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇవాళ దర్శించుకోనున్నారు.
రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం 10గంటలకు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలబలాలపై అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర పదాధికారులు, భాజపా ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు, జిల్లా ఇంఛార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే విధంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దర్శించుకోనున్నారు.