రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతుంటే... ప్రభుత్వం పట్టించుకోకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని భాజపా కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు తెరాసకు కర్రుకాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అప్రజాస్వామిక, రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెరాసకు చరమగీతం పాడేది భాజపాయేనన్నారు. వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సాయం పంపిణిలో తెరాస నేతల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది: పొంగులేటి
దుబ్బాక ప్రజలు తెరాసకు కర్రు కాల్చి వాత పెట్టారని... భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బిహార్, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు విపక్షాలకు చెంపపెట్టు లాంటివన్నారు. మోదీపై విమర్శలు మానుకొని... కాంగ్రెస్ తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వం అరచేతిలో వైకుఠం చూపిస్తోంది: పొంగులేటి
ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు మేలు చేయాలని నూతన చట్టాలు తీసుకువస్తే ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని ఆక్షేపించారు. దుబ్బాక, బిహార్ ఎన్నికల ఫలితాలే వాటికి చెంప పెట్టు లాంటివన్నారు. కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీపై అవాకులు చవాకులు పేలడం మానేసి తమ ఇంటిని చక్కపెట్టుకోవాలని సూచించారు.