తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi Sanjay: జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తారు..? - హైదరాబాద్​ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల కోసమే కేసీఆర్ పనిచేస్తారని ఆరోపించారు.

Bandi Sanjay
బండి సంజయ్

By

Published : Aug 21, 2021, 8:33 PM IST

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళిత బంధు ఎలా ఇస్తారో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చిలుకలగూడకు చేరిన సందర్భంగా ఆయన జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల కోసమే కేసీఆర్ పనిచేస్తారని ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 2023 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay: జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తారు..?

'కరోనా వచ్చి దేశం అతలకుతలమవుతుంటే.. ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో బాధపడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తామని చెప్పారు. పోయిన నెల రాష్ట్రం ఇచ్చే బియ్యం ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యమే ఇచ్చారు. రేషన్​ దుకాణంలో కేసీఆర్​ ఫొటో పెట్టుకున్నారు. వ్యాక్సిన్​ కేంద్రం వద్ద కేసీఆర్​ ఫొటో పెట్టుకున్నారు. భాజపా కార్యకర్తలు గ్రామాల్లో, బస్తీల్లో తిరిగి కేంద్రం ఇచ్చే నిధులపై ప్రజలకు వివరించండి.'

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details