తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రేష్ట భారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని శ్రేణులకు మోదీ పిలుపు - భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Ravishanker Prasad: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగానికి సంబంధించి విషయాలను పార్టీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. స్నేహయాత్ర ద్వారా పార్టీ శ్రేణులు దేశంలోని అన్ని వర్గాలను కలవాలని ప్రధాని ఆదేశించినట్టు తెలిపారు.

BJP senior Leader ravi shanker prasad conveyed modi speech in BJP NEC
BJP senior Leader ravi shanker prasad conveyed modi speech in BJP NEC

By

Published : Jul 3, 2022, 10:32 PM IST

శ్రేష్ట భారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని శ్రేణులకు మోదీ పిలుపు

Ravishanker Prasad: శ్రేష్ట భారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని భాజపా శ్రేణులకు నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల బుజ్జగింపు రాజకీయాల స్థానంలో ప్రజలందరినీ పరిపుష్టి చేసే రాజకీయాలే లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాని ప్రసంగానికి సంబంధించి విషయాలను పార్టీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

దేశ సంరక్షణే అజెండాగా ఎదిగిన భాజపా పరిణామ క్రమాన్ని మోదీ వివరించినట్లు రవిశంకర్​ తెలిపారు. ప్రజాస్వామ్యమే ఆలోచన విధానంగా భాజపా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ కాంగ్రెస్‌ నేత అయినప్పటికీ.. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన అనేక పార్టీలు అంతరించే దశకు చేరుకుంటున్నాయని మోదీ చెప్పినట్లు రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు. దీనిపై వ్యంగాస్త్రాలు విసరకుండా వారి తప్పుల నుంచి పాఠాలు నేర్వాలని సూచించారు. స్నేహయాత్ర ద్వారా పార్టీ శ్రేణులు దేశంలోని అన్ని వర్గాలను కలవాలని ప్రధాని ఆదేశించినట్టు రవిశంకర్​ తెలిపారు.

"ప్రధాని రెండు విషయాలను విశేషంగా చెప్పారు. మన ఆలోచనా విధానం పీ2 నుంచి జీ2వరకు ఉండాలని తెలిపారు. ప్రజాపక్షం, ప్రజాఅనుకూల ప్రభుత్వమే మన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. బుజ్జగింపుల నుంచి ప్రజలను పరిపుష్టి చేసే రాజకీయాలను ఆచరించి దేశం ముందుంచాలి. ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌భారత్‌- సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌, సబ్‌కావిశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మన లక్ష్యం కావాలి." - రవిశంకర్‌ప్రసాద్‌, భాజపా సీనియర్‌ నేత

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details