తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా పెట్టింది: మోత్కుపల్లి - మోత్కుపల్లి నర్సింహులు వార్తలు

నిజాంను మించి కేసీఆర్ పరిపాలనా చేస్తున్నారని... భాజపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో భాజపా పార్టీ లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోపించారు.

bjp-senior-leader-motkupally-narasimhulu-serious-on-kcr-and-ktr
కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా పెట్టింది: మోత్కుపల్లి

By

Published : Nov 2, 2020, 8:02 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​పై భాజపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ నిజాంను మించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. 1,200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణను... కేసీఆర్ కుంటుంబం అనుభవిస్తుందంటూ ఆరోపించారు.

కనికరంలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం బాధాకరమన్నారు. భాజపాను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా పెట్టిందన్నారు. రెండు సంవత్సరాల తరువాత రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనన్నారు.

ఇదీ చూడండి:ఎన్నిక ఏదైనా కేసీఆర్​ నాయకత్వానికే జై కొడుతున్నారు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details