మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో భాజపా సంకల్ప యాత్ర చేపట్టింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచందర్ రావు, భాజపా నాయకులు పేరాల శేఖర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాగోల్ డివిజన్ పరిధిలోని కాలనీలలో సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలుగన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమని... అందుకు అనుగుణంగా మోదీ పరిపాలన కొనసాగుతోందని వారు అన్నారు. అంటరానితనం, అవినీతిని రూపుమాపి అహింస, స్వచ్ఛమైన పాలనను అందించడం కోసం భాజపా పాటు పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.
నాగోల్లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర - bjp sankalp yathra at hyderabad
భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్ నాగోల్లో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలు కన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు.

నాగోల్లో భాజపా గాంధీ సంకల్ప యాత్ర