దేశవ్యాప్తంగా భాజపా చేపట్టిన సంకల్ప యాత్ర ఘనంగా సాగుతోంది. గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 4వ రోజు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలానగర్ నుంచి మూసాపేట్ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ సూచించిన అవినీతిరహిత దేశం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి భాజపా కార్యకర్త పనిచేయాలని కోరారు. స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ సంకల్ప యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్లు యాత్ర జరగనుంది.
స్వచ్ఛ భారత్ నినాదంతో భాజపా సంకల్ప యాత్ర - bjp sankalp yatra
హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 4వ రోజు భాజపా సంకల్ప యాత్ర సాగుతోంది. బాలానగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.
"స్వచ్ఛ భారత్ నినాదంతో "భాజపా" సంకల్ప యాత్ర"