వైకాపాకు ఓటేయటం వలన వారికి సంఖ్య పెరుగుతుందని.. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తెదేపా ఇప్పటికే రాజకీయ రణరంగం నుంచి తప్పుకుందన్న ఆయన... ఏపీలో భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. తిరుపతిలో భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం నిర్వహించారు.
తిరుమలలో అన్యమత ప్రచారంపై చట్టం తెస్తాం: రఘునందన్‌రావు - తిరుపతి ఉపఎన్నికలు న్యూస్
తిరుమలలో అన్యమత ప్రచారాలు, ప్రార్థనా మందిరాలు లేకుండా బలమైన చట్టాన్ని తీసుకొస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఏపీలోని తిరుపతి ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.
తిరుపతి ఉపఎన్నికలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఏపీలోని దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా.. వారిని వైకాపా ప్రభుత్వం పట్టుకోలేకపోతుందన్నారు. అన్ని కేసులు సీబీఐ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు. తిరుమలలో అన్యమత ప్రచారాలు, ప్రార్థనా మందిరాలు లేకుండా బలమైన చట్టాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:'సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి'
Last Updated : Apr 3, 2021, 10:41 PM IST