రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాగ్ బంగ్లాలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు. తెలంగాణలో కొవిడ్ ను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి జిల్లాలోని ప్రతి మండలంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'కరోనా నియంత్రణలో తెరాస ప్రభుత్వం విఫలమైంది' - రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఇబ్రహీంపట్నంలో మండిపడ్డ భాజపా నాయకులు
రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహరెడ్డి ఇబ్రహీంపట్నంలోని డాగ్ బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఇబ్రహీంపట్నంలో మండిపడ్డ భాజపా నాయకులు
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఓ మహిళ మృతి చెందిన ఐదు రోజులకు కరోనాతో మరణించినట్లు రిపోర్టు ఇచ్చారని... దీని బట్టి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తెలుస్తోందని అన్నారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.