తెలంగాణ

telangana

ETV Bharat / city

అందుకే కేటీఆర్​ను సీఎం చేయాలనుకుంటున్నారు: లక్ష్మణ్ - laxman about municipal elections

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ప్రభుత్వం తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకుంటున్నారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్​ అర్హుడంటూ మంత్రులు చేస్తున్న ప్రచారంపైన స్పందించారు.

bjp president laxman
bjp president laxman

By

Published : Jan 4, 2020, 1:24 PM IST

Updated : Jan 4, 2020, 5:38 PM IST

వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కేసీఆర్ గ్రహించారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందుకే కుమారుడిని సీఎం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నామని... కానీ కేసీఆర్ కుటుంబంలో కొలువులు వచ్చాయని విమర్శించారు.

సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేశ్​కుమార్​ను రాజకీయ లబ్ధి కోసమే సీఎస్‌గా నియమించారని లక్ష్మణ్​ ఆరోపించారు.

అందుకే కేటీఆర్​ను సీఎం చేయాలనుకుంటున్నారు: లక్ష్మణ్

ఇదీ చూడండి: 'కేసీఆర్​ తర్వాత కేటీఆరే సీఎం​.. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు..'

Last Updated : Jan 4, 2020, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details