తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్లు... త్వరలో ఆయనతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. మోదీ ప్రభుత్వం కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న పవన్ సేవలు దేశవ్యాప్తంగా వినియోగించుకుంటామని తెలిపారు.
'తెరాసది అధికార దుర్వినియోగం... గుణపాఠం తప్పదు' - bjp president laxman fire on trs
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనకు స్వస్తి పలుకుతామని చెప్పారు.

'పవన్ కల్యాణ్‌తో కలిసి కేసీఆర్‌ను దించుతాం'
కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనను జనసేనతో కలిసి దించుతామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనైతిక చర్యలతో దొడ్డిదారిన ఛైర్మన్ పదవులను చేజిక్కుంచుకుందని ఆరోపించారు. భాజపా గెలిచిన తుక్కుగూడాలో ప్రజా తీర్పును తెరాస ఖూనీ చేసిందన్నారు. తుక్కుగూడా ఛైర్మన్ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
'పవన్ కల్యాణ్‌తో కలిసి కేసీఆర్‌ను దించుతాం'
ఇదీ చూడండి: రోడ్డుపైనే కొట్టుకున్న తెరాస, భాజపా నేతలు