ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లపై ఉన్న శ్రద్ధ..పేదల డబుల్ బెడ్ రూం పథకం, దివ్యాంగుల సంక్షేమంపై లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. హైదరాబాద్ అడిక్‌మెట్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హాల్‌లో వృథాగా ఉన్న వీల్ ఛైర్‌లను పరిశీలించారు. దాదాపు మూడేళ్ల నుంచి వృథాగా దుమ్ము, ధూళి మధ్య పడి ఉన్నాయని ఆరోపించారు. వేలాది మందికి ఉపయోగపడే వీల్ ఛైర్స్‌కు వెచ్చించిన ప్రజాధనం వృథా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ప్రజాధనం వృథా చేసే అధికారం ఎవరిచ్చారు..?: లక్ష్మణ్
హైదరాబాద్ అడిక్‌మెడ్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హాల్ నిల్వ ఉన్న వీల్ ఛైర్స్‌ను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పరిశీలించారు. మూడేళ్లుగా పంపిణీ చేయకుండా... ప్రజాధనాన్ని వృథా చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు
విద్యాసంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు ఉపాధి అవకాశం కల్పించకుండా బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 16న ముషీరాబాద్ భాజపా క్యాంపు కార్యాలయంలో వీల్ ఛైర్స్, చెవి పరికరాలు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, రాష్ట్ర వికలాంగుల సంగం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు, ముషీరాబాద్ భాజపా కన్వీనర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మలక్పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాల ధర్నా