తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: డీకే అరుణ - DK Aruna letter to Chief Minister of Telangana KCR

ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ బహిరంగ లేఖ రాశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నందున తెలంగాణలోను అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

BJP National Vice President DK Aruna to Chief Minister of Telangana KCR on EWS‌ Reservations
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై మీ వైఖరేంటి?

By

Published : Oct 15, 2020, 9:11 AM IST

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై సీఎం కేసీఆర్‌ తన వైఖరి స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె సీఎంకు లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాను తెలంగాణలో అమలు చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవడం మీ పాలసీనా? అని నిలదీశారు.

కేంద్రం ఓబీసీతో పాటు అన్నివర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేస్తుందనడానికి నీట్‌-2019 ప్రవేశాలే నిదర్శనమని తెలిపారు. మీ పార్టీనేతలు తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఇకనైనా మానుకోవాలని హితవు చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి:కేసీఆర్ తప్పుల వల్లే రాష్ట్రానికి రావాల్సిన నీరు రావట్లేదు: డీకే అరుణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details