బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పును స్వాగతిస్తున్నట్టు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ధర్మానికి, న్యాయానికి ప్రతీకగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం, 28 ఏళ్ల తర్వాత కేసు పరిష్కారం కావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
'బాబ్రీ' కేసు తీర్పుతో భాజపా వాదన నిజమైంది: డీకే అరుణ - బాబ్రీ మసీదు కూల్చివేతపై డీకే అరుణ హర్షం
ధర్మానికి, న్యాయానికి ప్రతీకగా బాబ్రీ మసీదు కేసు తీర్పు వచ్చిందని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్... భాజపా నేతలు, సాధువులు, వీహెచ్పీ నేతలపై తప్పుడు కేసులు మోపిందని ఆరోపించారు.
'బాబ్రీ' కేసు తీర్పుతో భాజపా వాదన నిజమైంది: డీకే అరుణ
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భాజపా నేతలు, సాధువులు, వీహెచ్పీ నేతలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు మోపిందని ఆరోపించారు. కూల్చివేత కుట్రపూరితంగా జరగలేదన్న తీర్పుతో భాజపా వాదన నిజమైందన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు మత రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'