గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి... హైదరాబాద్ అభివృద్ధికి బాటలు సుగమం చేయాలని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరోజు పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా.. బేగంపేట విమానాశ్రయం నుంచి కొత్తపేట చేరుకుని.. అక్కడ నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. కేసీఆర్ గద్దె దిగే సమయం వచ్చిందనే సందేశం ఇచ్చారని అర్థమవుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైందని చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి భాజపాను విజయతీరాలకు చేర్చాలని శ్రేణులకు సూచించారు. నాగోల్ చౌరస్తా వరకు జరగాల్సిన రోడ్‌షోను వర్షం కారణంగా మధ్యలోనే ముగించారు.. అనంతరం బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్లో జరిగే మేధావుల సమావేశానికి బయల్దేరి వెళ్లారు.
భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా - hyderabad civic polls
బల్దియా ఎన్నికల్లో పూర్తి శక్తితో భాజపా గెలుపే లక్ష్యంగా పోరాడుదామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం భాజపా పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నడ్డా కొత్తపేట ప్రధాన కూడలి నుంచి నాగోల్ చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు షోలో పాల్గొన్నారు.
భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా
ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా పని చేద్దాం. అందరం ఏకతాటిపైకి వచ్చి పార్టీని విజయతీరానికి చేరుద్దాం. హైదరాబాద్‌ను ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు అందరం కృషి చేయాలి. అవినీతి కట్టడికి, పార్టీ అభివృద్ధికి ఎక్కడికైనా వెళ్లేందుకైనా నేను సిద్దం. అందుకే హైదరాబాద్ ప్రజలకు విన్నవిస్తున్నాను. ప్రతి డివిజన్‌లో భాజపా గెలిచేందుకు మద్దతివ్వాలని కోరేందుకే వచ్చాను. - జేపీ నడ్డా, భాజపా జాతీయాధ్యక్షుడు
ఇవీ చూడండి:భాగ్యనగర పరిశుభ్రత.. ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత...