తెలంగాణ

telangana

ETV Bharat / city

సోమారపు సత్యనారాయణను కలిసిన భాజపా ఎంపీలు

తెరాస మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను భాజపా ఎంపీలు బండి సంజయ్​, ధర్మపురి అర్వింద్​ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. భాజపాలో చేరాలని ఆహ్వానించారు.

By

Published : Jul 14, 2019, 5:32 PM IST

Updated : Jul 14, 2019, 7:41 PM IST

సోమారపు సత్యానారాయణ

పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్​ సోమారపు సత్యనారాయణను భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్​, బండి సంజయ్​లు గోదావరి ఖనిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే తెరాసకు రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణను భాజపాలో చేరాలని ఆహ్వానించారు. వారి వెంట కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

తెరాస సొంతవారినే ఓడిస్తోంది...

తెరాస రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టిక్కెట్​ ఇచ్చి ఇండిపెండెంట్​ అభ్యర్థికి మద్దతు పలికిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​​ అన్నారు. సొంత పార్టీ వారినే ఓడించే స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన చుట్టూ ఉన్న వారికే పట్టం కడుతున్నారని ఆరోపించారు. పార్టీలో ఉన్న సీనియర్​ నాయకులకే సముచిత స్థానం ఇవ్వకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను భాజపాలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని తెరాస మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు.

సోమారపు సత్యనారాయణను కలిసిన భాజపా ఎంపీలు

ఇదీ చూడండి : శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

Last Updated : Jul 14, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details