కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లుల ఆర్డినెన్స్‌తో రైతుకు ఎంతో లాభం చేకూరనుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రైతు తాను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పండించిన చోటే, ఏజెంట్ అడిగిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. కొత్త విధానంతో ఎవరికీ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేదన్న ఆయన... పంట విక్రయించిన రోజే రైతు ఖాతాలో సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు - వ్యవసాయ బిల్లు ఆర్డినెన్స్‌పై భాజపా ఎంపీ అర్వింద్
దేశంలో ఎక్కడైనా... ఎవరికీ కమీషన్ ఇవ్వకుండా పంట అమ్ముకునే అవకాశం... కేంద్రం కల్పిస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ ఆర్డినెన్స్‌పై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు
వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే వారిని రైతు వ్యతిరేకులుగా భావించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికల ముందు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తం, నాణ్యమైన విత్తనాలు అందిస్తం అంటూ... హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. రైతును రాజు చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు.
ఇదీ చూడండి:8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
TAGGED:
mp arvind