కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్ అమలులో తెలుగు రాష్ట్రాల వైఖరిని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు (MP GVL on KRMB, GRMB) తప్పుపట్టారు. బోర్డు కార్యకలాపాల కోసం ఇరు రాష్ట్రాలు నిధులివ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించటంపై ఆయన మండిపడ్డారు.
'కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్ అమలులో నిర్లక్ష్యం.. బోర్డు కార్యకలాపాల కోసం రెండు రాష్ట్రాలు నిధులివ్వలేదు. 6 నెలల్లో డీపీఆర్ ఇవ్వాలని ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. డీపీఆర్‌లు ఇవ్వడంలో ఏపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి జరగబోయే అన్యాయంపై ప్రభుత్వం మేలుకోవాలి. సీఎం జగన్ వెంటనే సంబంధిత శాఖలతో సమీక్ష జరపాలి. డీపీఆర్ వెంటనే సమర్పించేలా చర్యలు తీసుకోవాలి"