తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నిందితులందర్ని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరారు.
'హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి' - telangana high court lawyer couple murder case updates
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించేందుకు రాంచందర్ రావు ఆధ్వర్యంలో.. సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు గుంజపడుగుకు బయలుదేరారు.
'హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయాలి'
రాష్ట్రంలో తెరాస నాయకుల అరాచకాలు శ్రుతి మించాయన్న రాంచందర్ రావు. న్యాయవాదుల కుటుంబానికి అండగా ఉంటూ.. వారి హక్కులను కాపాడేందుకు భాజపా లీగల్ సెల్ కృషి చేస్తుందని తెలిపారు. రాంచందర్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల కుటుంబాన్ని పరామర్శించేందుకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు గుంజపడుగుకు బయలు దేరారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల హత్య కేసులో అనుమానాలెన్నో...!
Last Updated : Feb 21, 2021, 12:59 PM IST