హైదరాబాద్‌లో వరద బాధితులకు సరైన న్యాయం జరగలేదని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. రూ.500 కోట్లనైనా వరద బాధితులకు సరిగా అందించలేక పోయారని మండిపడ్డారు. తమకు వరదసాయం అందలేదంటూ పలు కాలనీల వాసులు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు.
'ధరణి ప్రాజెక్టును ఆ కంపెనీకి ఎలా కట్టబెడతారు..?' - bjp mlc ramachandra rao allegation on dharani project
ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీకి ధరణి ప్రాజెక్టును ఎలా కట్టబెడతారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధానంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు సరైన న్యాయం జరగలేదని రాంచందర్‌రావు ఆరోపించారు.
MLC RAM CHANDERRAO
పలు రాష్ట్రల్లోని స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు ధరణి ప్రాజెక్టును ఎలా కట్టబెట్టారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నాగాలాండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో పలు స్కాంలకు కారణమైన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు ప్రాజెక్టును కట్టబెట్టిన విధానంపై విచారణ జరపాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణమా..: ఉత్తమ్
Last Updated : Nov 15, 2020, 5:51 PM IST