కేసులు తక్కువగా చూపాల్సిన అవసరం మనకు లేదు. ఆరోగ్య శ్రీ పథకంపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయడం లేదు. ఆయుష్మాన్ మనకి పనికిరాదు.. దానికంటే ఆరోగ్య శ్రీ ఉత్తమం అని సీఎం కేసీఆర్ అనడం సబబు కాదు. దేశంలో కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధిపొందారు. కేంద్ర పథకాలు అన్ని అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు? ఆరోగ్య శ్రీలో కూడా లొసుగులున్నాయి. వాటి జోలికి మేము వెళ్లట్లేదు. కానీ ఆరోగ్య శ్రీలో కరోనాను కూడా చేర్చాలి. - రామచందర్‌రావు, భాజాపా ఎమ్మెల్సీ.
'ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయడం లేదు' - తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాలు 2020
రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు శాసనమండలిలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తక్కువ జరుగుతున్నాయనే విషయం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటే ప్రజలు నష్టపోతారు'
కేంద్రం, రాష్ట్రం అని ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడం సబబు కాదని రామచందర్‌రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటే ప్రజలు నష్టపోతారని అన్నారు.
ఇవీ చూడండి:వ్యవసాయంలో పంటల మార్పిడి జరగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి