ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు కార్యకర్తలతో ట్యాంక్‌బండ్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమీపంలో ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసులను భాజపా కార్యకర్తలు అడ్డుకోవడంతో... అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు అరెస్టు - tsrtc strike Breaking
భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కార్యకర్తలతో ట్యాంక్‌బండ్‌కు వెళ్తుండగా మధ్యలోనే అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు అరెస్టు
కార్మికులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి హింసిస్తున్నారని రామచందర్ రావు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపకపోతే...పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఛలో ట్యాంక్‌బండ్: లిబర్టీలో అశ్వత్థామరెడ్డి అరెస్ట్