తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్​కు పదిసార్లు ఫోన్​ చేసినా ఫలితం లేదు: రాజాసింగ్​ - mla raja singh allegations on ktr

గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కరోనా బాధితురాలు హర్ష మృతిచెందిందని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. హర్షకు సరైన వైద్యం అందించాలని కేటీఆర్​, ఈటలను సంప్రదించినా ఫలితం లేదన్నారు.

RAJA SINGH
కేటీఆర్​కు పదిసార్లు ఫోన్​ చేసినా ఫలితం లేదు: రాజాసింగ్​

By

Published : Jun 4, 2020, 5:19 PM IST

Updated : Jun 4, 2020, 5:41 PM IST

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చేరిన ఏడు నెలల గర్భిణి మరణించిందని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. సరైన వైద్యం అందించడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తనతో చెప్పారన్నారు. ఇదే విషయమై.. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​కు ఫోన్​ చేసినా ఫలితం లేదన్నారు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​తో మాట్లాడినా సరిగా స్పందించలేదన్నారు. మొదట్లో కరోనా రోగులను పట్టించుకున్న ప్రభుత్వం, వైద్యులు.. ఇప్పుడెందుకు అశ్రద్ధ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. హర్ష మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమాధానం చెప్పాలని రాజాసింగ్​ డిమాండ్​ చేశారు.

కేటీఆర్​కు పదిసార్లు ఫోన్​ చేసినా ఫలితం లేదు: రాజాసింగ్​
Last Updated : Jun 4, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details