ప్రశ్నిస్తే చంపేస్తారా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో న్యాయవాదుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. న్యాయవాద దంపతుల హత్యాకాండ ప్రభుత్వ హత్యలేనని రాజాసింగ్ విమర్శించారు.
'చలో గుంజపడుగు': ప్రశ్నిస్తే చంపేస్తారా?: రాజాసింగ్ - పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల హత్య
పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల దారుణ హత్యలపై సీబీఐ, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలా చేస్తేనే అసలు కుట్ర బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. 'చలో గుంజపడుగు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'చలో గుంజపడుగు': ప్రశ్నిస్తే చంపేస్తారా?: రాజాసింగ్
న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ.. భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో చలో గుంజపడుగు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా భాజపా న్యాయవిభాగం ప్రతినిధుల బృందం హైదరాబాద్ నుంచి గుంజపడుగుకు బయల్దేరింది. రెండు బస్సుల్లో న్యాయవాదులు పెద్దపల్లి జిల్లా వామనరావు స్వగ్రామం గుంజపడుగుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొంటారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
ఇవీచూడండి:'మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోంది'
Last Updated : Feb 21, 2021, 11:31 AM IST