ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలోనూ అమలు చేయాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు పేదల జేబులు గుల్లచేస్తున్నాయన్న రాజాసింగ్.. ప్రైవేటు దవాఖానాలో చేరిన రోగులు మరణిస్తే పైసా కూడా చెల్లించకుండా బాధితుల ఇంటివద్దకే మృతదేహం చేరేలా చట్టం తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యల కారణంగా ప్రైవేటు సంస్థల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తున్నారని రాజాసింగ్ అన్నారు. ప్రైవేటు సంస్థల్లోని ఫీజులపై సర్కారు దృష్టిసారించాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.