తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2022, 7:17 PM IST

ETV Bharat / city

Raghunandan rao comments: 'మొదటి రోజే సస్పెండ్​ చేసి.. ఇప్పటివరకు కారణాలు చెప్పలేదు..'

Raghunandan rao comments: బడ్జెట్​ సమావేశాల మొదటి రోజే సస్పెండ్​ చేసి.. కారణాలు అడిగితే ఇప్పటి వరకు తెలపలేదని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. ఏపీ క్యాడర్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణకు సీఎస్‌ అయ్యారని, సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరతామని రఘునందన్‌ తెలిపారు.

BJP MLA Raghunandan rao comments on high court refuses stay on suspension
BJP MLA Raghunandan rao comments on high court refuses stay on suspension

Raghunandan rao comments: బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజే తమను సభ నుంచి సస్పెండ్‌ చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. కారణాలు ఏంటని అడిగితే ఇంత వరకు ఇవ్వలేదన్నారు. కోర్టుకు వెళితే తమ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఏపీ క్యాడర్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణకు సీఎస్‌ అయ్యారని, సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరతామని రఘునందన్‌ తెలిపారు.

"బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించారు. స్పీకర్​కు ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆ రోజు బయటకు పంపించారు. సస్పెండ్​కి కారణాలు ఏంటని రాత పూర్వకంగా హామీ అడిగాం. ఇంత వరకు ఇవ్వలేదు. అసెంబ్లీ సెక్రెటరీకి నోటీసులు ఇవ్వండని హైకోర్టు చెప్పింది. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన మా పీఏను 3 గంటల పాటు బయటే ఉంచారు." - రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details