Raghunandan Rao Interview : హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌కు సంబంధించి మైనర్ బాలిక ఫొటోలు వీడియోలు బయటపెట్టారంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలికకు సంబంధించిన ఎలాంటి విషయాలు తాను వెల్లడించలేదని రఘునందన్‌రావు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై బురద జల్లుతుందని మండిపడ్డారు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. తానెప్పుడూ బాధితురాలి తరపున పోరాడుతానంటున్న రఘునందన్ రావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
'బాలిక వివరాలు నేను చెప్పలేదు.. నాకూ చట్టం తెలుసు' - జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై రఘునందన్ రావు
Raghunandan Rao Interview
13:00 June 07
నేనేం తప్పు చేయలేదు : ఎమ్మెల్యే రఘునందన్ రావు