సీఏఏకు మద్దతుగా ఈనెల 15న ఎల్బీస్టేడియం వేదికగా భాజపా తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది. ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ సమావేశాల ఒత్తిడి కారణంగా రాలేకపోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఫలితంగా సభను వాయిదా వేసినట్లు ప్రకటించారు. సభ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.
హైదరాబాద్లో భాజపా 'సీఏఏ' సభ వాయిదా - bjp cancelled meeting on caa
సీఏఏకు మద్దతుగా ఈనెల 15న తలపెట్టిన భాజపా సభ వాయిదా పడింది. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.
అందుకే 'సీఏఏ'పై సభ వాయిదా: లక్ష్మణ్
సీఏఏపై అపోహలు తొలగించేలా.. ప్రజల్లో అవగాహన పెంచేందు కోసం కమలనాథులు ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఇవీచూడండి:కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్లోని పలు పాఠశాలలకు సెలవులు