యశోద ఆసుపత్రి ముందు భాజపా మహిళా మోర్చా ధర్నా - భాజపా మహిళా మోర్చా ఆందోళన
కరోనా చికిత్సకు నామమాత్రపు బిల్లులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రి ముందు ధర్నా చేశారు.
యశోద ఆసుపత్రి ముందు భాజపా మహిళా మోర్చా ధర్నా
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రి ముందు భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదుకోవాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు అధిక బిల్లులు వేసి దోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కరోనా బాధితులకు నామమాత్రంగా బిల్లులు తీసుకొని చికిత్స చేయాలని డిమాండ్ చేశారు.