న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్యను నిరసిస్తూ భాజపా మహిళా మోర్చా డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు దీతా మూర్తి ఆధ్వర్యంలో భాజపా కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తును డీజీపీ కార్యాలయం వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భాజపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
డీజీపీ కార్యాలయ ముట్టడికి 'భాజపా' యత్నం.. ఉద్రిక్తం - telangana news
న్యాయవాదుల హత్యను ఖండిస్తూ భాజపా మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన చేపట్టారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన 30మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డీజీపీ కార్యాలయ ముట్టడికి భాజపా మహిళా మోర్చా యత్నం
జంట హత్య కేసులో విచారణ జరపాలని వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే తాము వచ్చామని.. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్న పోలీసులు నిన్న హత్య జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. మహిళా కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 30మంది ఆందోళకారులను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీనగర్, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరిలించారు.
ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Last Updated : Feb 18, 2021, 2:59 PM IST