తనపై పలువురు అత్యాచారం చేశారని హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళకు న్యాయం చేయాలని భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి డిమాండ్ చేశారు. ఒక గిరిజన తెగకు చెందిన యువతి అయినప్పటికీ చదువుకోవాలనే ఉద్దేశంతో బాధితురాలు న్యాయ విద్యను అభ్యసించిందని గీతా మూర్తి తెలిపారు. ఎంతో ధైర్యంగా తనపై జరిగిన ఈ ఘటనను బయట పెట్టిందన్నారు.
'అత్యాచారానికి గురైన మహిళకు వెంటనే న్యాయం చేయాలి'
అత్యాచారానికి గురైన గిరిజన మహిళకు న్యాయం చేయాలని భాజాపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు తెలిపిన గీతా మూర్తి.. నిందితులందరికీ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
bjp mahila morcha leader geetha murthy demanded police to arrest rape case accused
ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లుగా చెప్తున్నందున దీన్ని ప్రత్యేక దృష్టితో పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్ష పడేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గీతా మూర్తి కోరారు.