తెలంగాణ

telangana

ETV Bharat / city

bjp protest: కలెక్టరేట్లను ముట్టడించిన భాజపా.. పలు చోట్ల ఉద్రిక్తత - BJP leaders protest over Ganesh celebrations

వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా భాజపా నాయకులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా నేతలు.. కలెక్టరేట్లను ముట్టడించగా.. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించటంతో ఉద్రికత్త నెలకొంది. పలుప్రాంతాల్లో పోలీసులు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

bjp leaders protests in ap
ఏపీలో కలెక్టరేట్ల ముట్టడి

By

Published : Sep 6, 2021, 3:01 PM IST

గణేశ్​ ఉత్సవాలపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నాయకులు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో భాజపా శ్రేణులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.

నంద్యాలలో..
కర్నూలు జిల్లా నంద్యాలలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, రాష్ట్రీయ ధర్మ రక్షాదల్ ధర్నా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు తీసుకురావడం ప్రభుత్వానికి సరికాదని పేర్కొన్నారు.

మచిలీపట్నంలో..

వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భాజాపా నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఆర్​అండ్​బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్​ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించిన భాజపా నేతలు కలెక్టరేట్​లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనుమతులు లేకుండా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన భాజపా నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి సమీపంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఆ పార్టీ నేతలు నూకల శేషయ్య నాయుడు, ఎన్ రాము, విఠల్ సాయి, నున్న అరవింద్ ఉన్నారు.

కడప కలెక్టరేట్​లో..

గణేశ్​ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. కలెక్టరేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఆందోళనకారులు బారికేడ్లను కిందకు తోసేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారాలను తోసుకుంటూ కలెక్టర్​ ఛాంబర్ వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులను ఆపలేకపోయారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణం వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

ఇదీ చదవండీ..ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details