హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ గ్రీన్‌పార్క్ కాలనీలో గందరగోళం నెలకొంది. 30న జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బంధువు కాలనీలోని ఓ ఇంట్లో డబ్బులు పంపిణీ చేస్తుండగా... భాజపా నేతలు పట్టుకున్నారు. సదరు వ్యక్తిని ఎన్నికల అధికారులకు, పోలీసులకు అప్పగించారు.
లింగోజిగూడలో టెన్షన్.. పోలీసుల వైఖరిపై భాజపా నేతల ఆందోళన - tension in lingojiguda
హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్‌పార్క్ కాలనీలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉపఎన్నికల వేళ డబ్బులు పంచుతున్న వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్జాగా వచ్చి తీసుకెళ్లటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
bjp leaders protest in lingojiguda
అనంతరం దర్పల్లి రాజశేఖర్ రెడ్డి వచ్చి పోలీసు వాహనం నుంచి ఆ వ్యక్తిని దింపి తీసుకువెళ్లారంటూ భాజపా నేతలు ఆరోపించారు. ఈ ఘటన పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాలనీలో కొంత గందరగోళం నెలకొంది.