ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే పేద ప్రజలకు అందజేయాలని భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా ధర్నా - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం ముందు భాజపా నేతలు ఆందోళన చేశారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
bjp leaders protest against lrs act in kukatpally
ఎల్ఆర్ఎస్ వల్ల మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.