తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్టీసీ బస్సుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' - భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి

నేటి నుంచి హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సు సర్వీసుల పునఃప్రారంభమైనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భాజపా నాయకులు కోరారు. ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.

bjp leaders on rtc services started in hyderabad
bjp leaders on rtc services started in hyderabad

By

Published : Sep 25, 2020, 11:54 AM IST

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్యాన్ని కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని... భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​రెడ్డి డిమాండ్​ చేశారు. నేటి నుంచి హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సు సర్వీసుల పునఃప్రారంభమైనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులకు కరోనా సోకకుండా మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో వైద్య, పోలీస్‌ సిబ్బందిని నిర్లక్ష్యం చేసినట్టు... ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని భాజపా నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

ABOUT THE AUTHOR

...view details